VIDEO: మహిళల వన్డేలకు విశాఖ సిద్ధం
విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఈ నెల 21, 23 తేదీల్లో భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య డే అండ్ నైట్ వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖలో మరోసారి క్రికెట్ వైబ్ మొదలవుతుందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని నాని ఎక్స్ వేదికగా శనివారం తెలిపారు.