గర్భిణీ స్త్రీలకు అవగాహన

గర్భిణీ స్త్రీలకు అవగాహన

PPM: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పార్వతీపురం రూరల్, పట్టణ పరిధిలో పోషణ్ పక్షోత్సవాలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 23 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా పలు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. గర్భస్థ శిశువు మెదడు అభివృద్ధిలో సరైన పోషకాహారం పాత్రపై తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.