చిలకలూరిపేట పేరు వెనుక కథ..!
PLD: చిలకలూరిపేట పేరు చిలకలూరు+పేట అనే పదాల కలయిక. పూర్వం ఇక్కడ పచ్చని తోటలు, చెట్లు ఎక్కువగా ఉండటంతో వేల సంఖ్యలో చిలకలు నివసించేవి. అందుకే దీనికి 'చిలకల ఊరు' అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా (పేట) అభివృద్ధి చెందడంతో 'చిలకలూరిపేట'గా స్థిరపడింది. కాగా, ప్రస్తుతం ఇది జిల్లాలో ఒక కీలక వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది.