నేతన్నలకు భరోసా చెక్కుల పంపిణీ
GDWL: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజోలి సర్పంచ్ గంగిరెడ్డి తెలిపారు. ‘99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా యుబిఐ బ్యాంక్ పరిధిలో నేతన్నభరోసా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, నేతన్నలు పాల్గొనగా, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.