'ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం'

'ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం'

PPM: ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ అన్నారు. బుధవారం కొమరాడ మండలం లాబేసు, తులసివలస గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి జగదీశ్వరీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు.