VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
కృష్ణా: పామర్రు లబ్ధిదారుల పెందుర్తి భువనేశ్వరి, సమ్మంగి శ్రీనివాసరావు గృహాలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వెళ్లి, రూ.1,13,595 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీలో వైద్యానికి అవకాశం లేని రోగులకు, ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.