'వంద శాతం పన్నులు వసూలు చేయాలి'

'వంద శాతం పన్నులు వసూలు చేయాలి'

BPT: వాణిజ్య పన్నులు 100% వసూలు చేయాలని కలెక్టర్ వినోద్ ఆదేశించారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది రూ.116.83 కోట్ల లక్ష్యానికి గానూ.. రూ.94.22 కోట్లు మాత్రమే వసూలు కావడంపై ఆయన నిలదీశారు. గుత్తేదారులు, ప్రైవేటు ఆస్పత్రులు, వాణిజ్య సంస్థల నుంచి పక్కాగా పన్నులు రాబట్టాలన్నారు. పన్ను ఎగవేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.