'భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి'

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాగులు వంకల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలకుండా చూసుకోవాలని అన్నారు.