అద్దె చెల్లించని కాంప్లెక్స్‌లను సీజ్ చేసిన కమిషనర్
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ పోలేరమ్మ ఏరియాలోని మున్సిపాలిటీ కాంప్లెక్స్‌లను బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో అద్దె చెల్లించని కాంప్లెక్స్‌లను సీజ్ చేశామన్నారు. సకాలంలో అద్దె చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆమె పేర్కొన్నారు.