పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
NLR: గుడ్లూరు మండలం ఏలూరుపాడు మాగాణి పొలాల్లో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.29 వేల నగదు, 7 సెల్ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్సైలు సుదర్శన్, వెంకట్రావు సిబ్బందితో కలిసి దాడి చేశారు.