'ఫుడ్ పాయిజన్ ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే'

'ఫుడ్ పాయిజన్ ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే'

SRCL: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. వరుస ఫుడ్ పాయిజన్‌పై సిరిసిల్లలోని నేతన్న చౌక్ వద్ద ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరారు.