VIDEO: తల్లి, కుమారుడి దారుణ హత్య
W.G: భీమవరంలో సోమవారం ఉదయం అమానుష ఘటన చోటుచేసుకుంది. మన్నా చర్చి సెంటర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తల్లి మహాలక్ష్మిని, తమ్ముడు రవితేజను దారుణంగా హత్య చేశాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్పీ నయూం ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.