బస్సు ప్రమాదం.. సుమోటోగా కేసు నమోదు చేసిన HRC
TG: చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను రాష్ట్ర HRC సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనులు శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కాగా, RTC బస్సును.. టిప్పర్ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.