ఉత్కంఠ భరితంగా క్రీడా పోటీలు
NLG: నాగార్జునసాగర్‌లో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జట్లు ఫైనల్‌కు చేరుకోగా, 200 మీటర్ల పరుగు పందెంలో నాగార్జునసాగర్ పాఠశాల మొదటి స్థానం సాధించింది.