బిచ్కుందలో వైద్య శిబిరం

బిచ్కుందలో వైద్య శిబిరం

కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ హాయ్యూం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ పరిధిలోని సిబ్బందిని వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ రాకేష్, ల్యాబ్ టెక్నికల్ నరేష్, వైద్య సిబ్బంది తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.