KPHBలో గజం భూమి రూ.2.65 లక్షలు

KPHBలో గజం భూమి రూ.2.65 లక్షలు

HYD: హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫేజ్-1, 2లోని ధర్మారెడ్డికాలనీలో 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్-15 లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్‌కు సుమారు రూ.24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ విపి గౌతం వివరించారు. కాగా, గజం భూమి రూ. 2.65 లక్షలుగా పలికింది.