చెన్నపురావు పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం

NGKL: జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రికార్డు స్థాయిలో పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి లో 117.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 94.0, లింగాల 61.8 మి.మీ, కొండనాగుల 58.5, కోడేరు 44.8 మి.మీ, ఐనోల్ 35.5, కోండరెడిపల్లి 32.0, పెద్దకోతపల్లి 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.