VIDEO: నగరంలో పెట్రోల్ బంకులు బంద్
HYD శివారులో పలుచోట్ల పెట్రోల్ బంకులు బంద్ ఉండటంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉప్పల్, పోచారం, బోడుప్పల్, మల్లాపూర్, నాచారం, కుషాయిగూడ, ECIL, చర్లపల్లి, చెంగిచెర్ల, అన్నోజిగూడ, నాగోల్, హబ్సిగూడలోని దాదాపు 16 బంకులు బంద్ ఉన్నట్లుగా గుర్తించింది. పెట్రోల్ బంకుల వద్ద యాజమాన్యాలు అందుబాటులో లేని పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు.