మౌలిక సదుపాయాలు కల్పించాలి: ఎమ్మెల్యే
NLG: గుండ్లపల్లి (డిండి) మండల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే బాలునాయక్ మండల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో తాగునీరు సరఫరా పై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఆదాయం, బడ్జెట్ కు అనుగుణంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.