'మా హక్కులకై పోరాటాలు ఉద్ధృతం చేస్తాం'

'మా హక్కులకై పోరాటాలు ఉద్ధృతం చేస్తాం'

KRNL:పెన్షన్లు తొలగించడంపై ఆలూరులోని అంబేద్క‌ర్ సర్కిల్లో దివ్యాంగులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వారికి మద్దతుగా వైసీపీ MLA విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. కాగా, దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడి, నిరాహార దీక్షలు చేపడతామని వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు హెచ్చరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.