కాలువలో పడి వ్యక్తి మృతి.. వివరాలివే
KDP: కలసపాడులో పంట కాలువలో దస్తగిరి (63) అనే వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దస్తగిరి మద్యానికి బానిసై మూడు రోజులుగా ఇంటికి రాలేదని, మద్యం మత్తులో కాలువలో పడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివరాలను ఎస్సై సుభాన్ మీడియాకు వెల్లడించారు.