రైతులపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

SRD: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య ఆరోపించారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ప్రతిరోజు పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు.