శివాలయంలో హుండీ చోరీ కేసు ఛేదన..!
NRPT: నర్వ మండల కేంద్రంలోని శివాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.12,302 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పబ్బతి రమేష్ తెలిపారు. కేసును వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని పట్టుకున్న ఎస్సై రమేష్‌ను, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా. వినీత్ ప్రత్యేకంగా అభినందించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.