ఓటరు జాబితా సవరణ జరగాలి: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ జరగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సవరణ జరిగితే హైదరాబాద్‌లో 4 లక్షల ఓట్లు తొలగించాల్సి వస్తుందని, డబుల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. తాము ఓట్ల చోరీ చేస్తే తమ ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయని అన్నారు. బీహార్‌లో BJPకి అనుకూల వాతావరణం ఉందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎందుకో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.