కొల్లు రవీంద్రకు పేర్ని నాని కౌంటర్
AP: తండ్రికి అన్నం పెట్టలేదంటూ తనపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై YCP నేత పేర్ని నాని స్పందించారు. సభ్యత సంస్కారం మరిని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నాని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని నాని పేర్కొన్నారు. తండ్రికి వ్యతిరేకంగా నామినేషన్ వేశానంటూ సత్యదూరమైన మాటలు చెప్పినా ప్రజలు నమ్మబోరని చెప్పారు.