'విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు'
ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని SP నితికాపంత్ తెలిపారు. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 750 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.