'CSR నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయండి'

'CSR నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయండి'

కృష్ణా: జిల్లాలో CSR నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘మీ కోసం’ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె CSR పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు త్వరితంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.