రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు

రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు

SKLM: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అధ్వానంగా ఉన్న రహదారులకు మంచి రోజులు రానున్నాయి. జిల్లాలో 219.కి.మీ. మేర 67 రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.100.28 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టెండర్లు పిలిచి ఆయా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈ కె. వీరన్నాయుడు తెలిపారు.