తాడిచెట్టు పైనుంచి పడి వ్యక్తికి గాయాలు
JN: బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోటి గంటి ఎల్లయ్య (75) ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఎల్లయ్య కింద పడడంతో ఎడమకాలు మోకాలు విరిగింది. తలకు బలమైన గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయాల పాలవడంతో వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.