ఎంఈవో - 1 జగదీష్‌కు సన్మానం
KRNL: పెద్దకడబూరు మండల నూతన మండల విద్యాశాఖ అధికారి - 1గా బాధ్యతలు స్వీకరించిన పి. జగదీష్ ను కంబలదిన్నె గ్రామ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి. మల్లప్ప ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పాలని జగదీష్ సూచించారు. ఇందులో బి. వెంకటేశ్వర్లు, నభి సాహెబ్, దామోదర్ పాల్గొన్నారు.