సదాశివనగర్‌లో యాక్సిడెంట్
KMR: సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నవీన్, కమ్మరి సౌందర్య ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారికి గాయాలయ్యా యి. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.