వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి

వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి

కృష్ణా: విజయవాడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యం వికటించి వారు మృతి చెందారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.