'మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు'
ప్రకాశం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని గిద్దలూరు YCP నాయకులు 13వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందదని, తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని గిద్దలూరు కన్వీనర్ బాలిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు బాలు యాదవ్ పాల్గొన్నారు.