వినుకొండలో జాతీయ జెండాతో ర్యాలీ

వినుకొండలో జాతీయ జెండాతో ర్యాలీ

GNTR: 79వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా వినుకొండలో శుక్రవారం విద్యార్థులు 1000 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆంజనేయులు హాజరై ర్యాలీని ప్రారంభించారు. నరసరావుపేట రోడ్డు నుంచి శివయ్య స్తూపం, మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ప్రజలందరూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు.