'ఆర్టీసీ బస్టాండ్‌లో వసతులు కరువు'

'ఆర్టీసీ బస్టాండ్‌లో వసతులు కరువు'

CTR: ప్రభుత్వ ఆదాయంలో ఆర్టీసీది కీలకపాత్రే.. ఏరోజుకారోజు ధనరూపంలో వచ్చే ఆదాయం ఆర్టీసీది. నిత్యం వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణ సమయాల్లో బస్టాండుల్లో కాసింత ఉపశమనం పొందాలనుకున్నా కనీస వసతులు కొరవడ్డాయి. చిత్తూరు బస్టాండులో పంకాలు తిరగక, విరిగిన కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వినోదం కోసం ఏర్పాటు చేసిన టీవీలు మాయమయ్యాయి.