జమ్మికుంటలో మున్సిపల్ పోలింగ్ షురూ..!
KNR: జమ్మికుంట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొత్తం 30 వార్డుల్లో 159 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అధికారులు 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 34,455 మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.