గణేష్ భక్తులకు GHMC కమిషనర్ సూచన

HYD: సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ. కర్ణన్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజి పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కోరారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సహకరించాలని ఆయన తెలిపారు.