'ఆపరేషన్ సింధూర్.. విద్యార్థుల విజయోత్సవం'

మేడ్చల్: ఆపరేషన్ సింధూర్ విజయవంతం ఆయన నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురువారం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు అందరితో కలిసి విజయోత్సవాలు నిర్వహించారు. మరోవైపు పహల్గామ్ దాడిలో మరణించిన 26 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. భారత సైన్యం పాక్ సైన్యానికి బుద్ధి చెబుతుందని మల్లారెడ్డి అన్నారు.