VIDEO: ఇల్లందకుంటలో ఘనంగా రథోత్సవం
KNR: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి రథోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఉత్సవమూర్తులను రథంపై ఆలయం చుట్టూ ఊరేగించి ఆలయంలోకి తీసుకెళ్లారు. వేలాది మంది భక్తులు రథం తాళ్లను పట్టుకుని లాగుతుండగా, మంగళవాయిద్యాలు మధ్య స్వామివారి రథం ఆలయం చుట్టూ వైభవంగా ఊరేగింది. 'జై శ్రీరామ్', 'గోవిందా.. గోవిందా' నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది.