రెండో విడత రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్
KMM: ఉమ్మడి జిల్లా రైతులకు రైతు భరోసా రెండవ విడత విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ రెండవ వారంలో భరోసా డబ్బులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ విడతలో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు భరోసా డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో ఎకరం లోపు అందరి రైతులకు భరోసా డబ్బులు అధికారులు జమ చేశారు.