రూ. 3 లక్షల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల చోరీ

రూ. 3 లక్షల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల చోరీ

NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో బుధవారం చోరీ జరిగింది. పంట పొలాల్లో మూడు చోట్ల ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను దుండగులు చోరీ చేశారు. వీటి ఖరీదు సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని బాధితులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న ఏఈ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.