డ్రోన్ కెమెరాలతో నిఘా..!

డ్రోన్ కెమెరాలతో నిఘా..!

కడప: గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. పారిపోయే నిందితులను డ్రోన్ సహాయంతో గుర్తించి పట్టుకుని, కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.