వీధి కుక్కల బీభత్సం నలుగురిపై దాడి

NRML: బైంసా మండలం వాలేగాం గ్రామం వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. నలుగురిపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారికి బైంసా ఏరియా ఆసుపత్రిని తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు