మాచర్లలో పరువు హత్య
AP: పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య జరిగింది. నవవధువు మృతి కేసు విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ప్రేమ వివాహం చేసుకున్న కూతురుని తండ్రి హత్య చేశాడు. కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోస్టుమార్టం నివేదికలో హత్య వ్యవహారాలు బయటపడ్డాయి. యువతి తండ్రి చంద్రశీనుతో పాటు కుటుంబసభ్యులు అరెస్ట్ అయ్యారు.