బాల్య వివాహాలపై అవగాహన
PPM: భద్రగిరి కేజీబీవీ పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ, టీనేజ్ గర్భధారణ తదితర అంశాలపై 200 మంది విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.