KKR vs SRH: కోల్‌కతాకు చెక్ పడాలి!

KKR vs SRH: కోల్‌కతాకు చెక్ పడాలి!

IPL 2026లో బౌలింగ్‌పై ఏమాత్రం అంచనాలు లేని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయ్యింది. ట్రావిస్ హెడ్ (11), అభిషేక్ శర్మ (7) జోడీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అభిషేక్ మళ్లీ ఫామ్‌తో ఇబ్బందిపడ్డాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా ఈ జోడీ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.