ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునతో పాటు కౌన్సిలర్లు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయా శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు.