ఆటో డ్రైవర్‌లతో ఎమ్మెల్యే పార్థసారథి
KNRL: ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిమ్మప్ప పోలీసుల భారీ జరిమానాలతో బతుకు కష్టమైందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి ఇవాళ ఆయన సమస్యలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పేదలపై జరిమానాల వేధింపులు ఉండకూడదని, నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.