'తమలోని శక్తిని తెలుసుకుంటే ప్రపంచాన్నే మార్చగలరు'

'తమలోని శక్తిని తెలుసుకుంటే ప్రపంచాన్నే మార్చగలరు'

MDCL: కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత తమలోని శక్తిని తెలుసుకొని సమాజ హితం కోసం పని చేసినట్లయితే ప్రపంచాన్ని మార్చవచ్చన్నారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు.