జిల్లా 147 నుంచి ప్రత్యేక బస్సులు

జిల్లా 147 నుంచి ప్రత్యేక బస్సులు

నెల్లూరు జిల్లా నుంచి శివరాత్రికి పలు ప్రాంతాలకు 147 ప్రత్యేక RTC బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి షేక్ షమీం శుక్రవారం తెలిపారు. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.